Loksaba elections results of Personalities







75 వేల మెజార్టీతో వైఎస్ జగన్ ఘనవిజయం

75 వేల మెజార్టీతో వైఎస్ జగన్ ఘనవిజయంహైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జయభేరి మోగించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి బరిలో దిగిన వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ 75 వేల ఓట్ల భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్ వి సతీష్ రెడ్డిపై ఘనవిజయం సాధించారు. వైఎస్ కుటుంబాన్ని దశాబ్దాలుగా ఆదరిస్తున్న పులివెందుల నియోజకవర్గం ప్రజలు మరోసారి అదే ఆదరణ చూపారు. వైఎస్ జగన్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో కడప లోక్ సభ నియోజవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన వైఎస్ జగన్.. అసెంబ్లీకి తొలిసారి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే బంపర్ మెజార్టీతో గెలుపొందారు.