
ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్ట్ ఎటాక్ కి ‘ఎ’ సర్టిఫికేట్ రావడం గురించి అడిగితే ‘ హార్ట్ ఎటాక్ ఒక క్లీన్ రొమాంటిక్ ఎంటర్టైనర్. దీనిలో ఎలాంటి వల్గారిటీ ఉండదు. కానీ సెన్సార్ వారు ఎ సర్టిఫికేట్ ఇవ్వడం చూసి షాక్ అయ్యాను. కానీ వాళ్లకి అలా అనిపించిందేమో అని సరిపెట్టుకున్నాను. చివరికి ప్రేక్షకులే చూసి డిసైడ్ చేస్తారు. నా వరకూ ఐతే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడదగిన సినిమా హార్ట్ ఎటాక్ అని గ్యారంటీ ఇవ్వగలనని’ నితిన్ అన్నాడు.
ఆదశర్మ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. పూరి జగన్నాధ్ పూరి టూరింగ్ టాకీస్ పై ఈ సినిమాని నిర్మించాడు.